ఆకస్మిక తనిఖీ చేసి హల్ చల్ చేసిన వైద్యశాఖ మంత్రి ఆమన్ గల్ పిహెచ్ సిలో తనిఖీ డాక్టర్ల పై రోగులు, స్ఱానికుల ఫిర్యాదు వెంటనే మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశాలు

నాగర్ కర్నూలు జిల్లా అమన్ గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు మంత్రి.

అయితే ఐదుగురు డాక్టర్లు ఉన్నప్పటికీ రోజుకో డాక్టర్ చొప్పున వంతులవారీగా వస్తున్నారంటూ మంత్రికి స్థానిక రోగులు, జనాలు ఫిర్యాదు చేశారు. అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్లకు వెంటనే మెమోలు ఇవ్వాలని సంబంధిత జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు మంత్రి.

అమన్ గల్ పిహెచ్ సి లో సదుపాయాలు లేవని రోగులు మంత్రి దృష్టికి తీసుకుపోయారు. మంచినీటి వసతి కూడా లేదని చెప్పారు. భవనం కూడా పాతది ఉన్నదని వివరించారు. ఎక్స్ రే, ల్యాబ్ సదుపాయాలు సరిగాలేవన్నారు.

పిహెచ్ సిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రోగులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ అమన్ గల్ phc లో ప్రతి రోజూ 200 నుంచి 250 వరకు రోగులు వస్తుంటారని వైద్య ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

మంత్రి ఉన్నఫలంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ప్రభుత్వ వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి