ఆత్మహత్యయత్నానికి యత్నించిన విద్యార్థి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థి ఆత్మహత్యయత్నం చేయడం సంచలనం సృష్టించింది.

పరిశోధనా విద్యార్థి అబ్రహం శుక్రవారం వర్సిటీలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీనికి విద్యార్థి గైడ్‌ వైజీశ్వరన్‌ కారణమని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

శనివారం పరిపాలనా భవనం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నానికి చెందిన అబ్రహంకు సరైన్‌ గైడెన్స్‌ ఇవ్వకుండా పలు విధాలుగా మానసికంగా ఒత్తిడిచేయడంతోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విద్యార్థులు ఆరోపించారు.