Asianet News TeluguAsianet News Telugu

విదేశీ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్‌‌ సస్పెండ్..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్‌లాండ్‌కు విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్‌ రవిరంజన్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.

HCU Professor Suspended After sexual assault charges on foreign student
Author
First Published Dec 3, 2022, 1:26 PM IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్‌లాండ్‌కు విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ప్రొఫెసర్‌పై రవిరంజన్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. రవిరంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టుగా వర్సిటీ అధికారులు తెలిపారు. ఇక, ప్రొఫెసర్ రవిరంజన్‌పై బాధిత విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కీచక ప్రొఫెసర్ ప్రొఫెసర్ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోనకు దిగారు. 

యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ వీసీ ఈ ఘటనపై స్పందించాలని.. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించిన స్పందన లేకుండా పోయిందని ఆరోపించారు. యూనివర్శిటీ అడ్మిన్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ క్రమంలోనే యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ రవిరంజన్‌పై వర్సిటీ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టుగా వర్సిటీ అధికారులు ప్రకటించారు. 

Also Read: విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. వెలుగులోకి కీలక విషయాలు.. హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన..

ఇక, బాధిత పిర్యాదు మేరకు ప్రొఫెసర్ రవిరంజన్‌పై గచ్చిబౌలి పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్‌ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ రవిరంజన్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. 

‘‘విద్యార్థిని ఫిర్యాదుతో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ హిందీ ప్రొఫెసర్‌ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి థాయ్‌లాండ్‌కు చెందినవారు. యూనివర్సిటీలో చదువుతున్నారు’’ అని  డీసీపీ శిల్పవల్లి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios