విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. వెలుగులోకి కీలక విషయాలు.. హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్‌లాండ్‌కు విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రొఫెసర్ రవిరంజన్‌పై బాధిత విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్‌లాండ్‌కు విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రొఫెసర్ రవిరంజన్‌పై బాధిత విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్‌ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ రవిరంజన్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు.
కీచక ప్రొఫెసర్ ప్రొఫెసర్ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ వీసీ ఈ ఘటనపై స్పందించాలని.. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించిన స్పందన లేకుండా పోయిందని ఆరోపించారు. యూనివర్శిటీ అడ్మిన్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మరోవైపు థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారయత్నం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో విద్యార్థిని క్యాంపస్ బయటకు వచ్చిందని.. అయితే హిందీ బేసిక్స్ నేర్పిస్తానని నమ్మించి ప్రొఫెసర్ రవిరంజన్ ఆమెను కారులో తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లి ఆమె చేత మద్యం తాగించాడు. అనంతరం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేశాడు. అనంతరం విద్యార్థినిని కారులో తీసుకోచ్చి యూనివర్సిటీ గేటు దగ్గర వదిలి పెట్టాడు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు నేరుగా గచ్చిబౌలి స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.