Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లో బుకింగ్ : జింఖానా గ్రౌండ్స్ వద్ద క్రికెట్ మ్యాచ్ టికెట్ల జారీ

ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి  ఇవాళ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు ఇస్తున్నారు. ఆన్ లైన్ బుక్ చేసుకున్న ఐడీ నెంబర్ తో పాటు ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని హెచ్ సీ ఏ  కోరింది. దీంతో ఇవాళ జింఖానా గ్రౌండ్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

HCA Gives Online Tickets At Gymkhana Grounds
Author
First Published Sep 23, 2022, 12:15 PM IST

హైదరాబాద్: ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి  జింఖానా గ్రౌండ్స్ లో శుక్రవారం నాడు టికెట్లు ఇచ్చారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి  జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్లు అందిస్తామని హెచ్ సీ ఏ తెలిపింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇవాళ కూడా పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఆఫ్ లైన్ టికెట్లు లేవని కూడా హెచ్ సీ ఏ స్పష్టం చేసింది.  టికెట్లు అయిపోయాయని  ఆఫ్ లైన్ లో టికెట్ల కొనుగోలు కోసం ఎవరూ కూడా రావొద్దని హెచ్ సీ ఏ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. 

ఈ నెల 15వ తేదీతో పాటు నిన్న ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం జరిపారు. టికెట్లు బుక్ చేసుకున్న ఐడీ , ఆధార్ కార్డు వివరాలతో జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చి టికెట్ తీసుకువెళ్లాలని హెచ్  సీ ఏ సూచించింది. దీంతో ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్నవారు  హెచ్ సీ ఏ సూచించిన ఆధారాలతో జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో ఇవాళ  ఎలాంటి ఇబ్బందులు  ఎదురు కాకుండా ఉండేందుకు గాను  పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.  ఆఫ్ లైన్ టికెట్ల కోసం వచ్చే వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

also read:జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట: బేగంపేట పోలీసుల కేసు నమోదు

ఈ నెల 25వ తేదీన అస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఉంది.ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం గందరగోళంగా మారింది. ఈ నెల 15న ఆన్ లైన్ లో కొద్దిసేపు టికెట్ల విక్రయం జరిగిన తర్వాత వెంటనే టికెట్లు అయిపోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ఆఫ్ లైన్ లో టికెట్ల  కోసం  క్రికెట్ అభిమానలు వారం రోజులుగా తిరుగుతున్నారు. దీంతో నిన్న జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల విక్రయాన్ని చేపట్టారు. అయితే ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ఓపెన్ చేసినా పదకొండున్నర వరకు ఒక్కటికెట్ కూడా విక్రయించలేదు. సాంకేతిక సమస్యలే కారణంగా చెప్పారు.ఈ పరిణామాలతో గేటు వైపునకు ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు రావడంతో  తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

నిన్న జరిగిన తొక్కిసలాటపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల విక్రయానికి సంబంధించి హెచ్ సీ ఏ ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు తమతో సమన్వయం కూడా చేసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట తర్వాత అక్కడే ఉన్న వారికి టికెట్లను విక్రయించారు. ఈ సమయంలో క్యూలైన్లు ఏర్పాటు చేసి సజావుగా జింఖానా గ్రౌండ్స్ లోకి వెళ్లేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios