హైదరాబాద్: తన మొదటి ప్రియుడు బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకొంటానని కీర్తి విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. 

తల్లి రజితను హత్య చేసిన కేసులో కీర్తిరెడ్డి, ఆమె రెండో ప్రియుడు శశికుమార్ లు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. రెండు రోజుల క్రితం కీర్తిరెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

గతనెల 19వ తేదీన రెండో ప్రియుడు శశికుమార్ ప్రేరణతో తల్లి రజితను కీర్తి రెడ్డి చంపేసింది. తల్లి ఛాతీపై కీర్తి రెడ్డి కూర్చొన్న సమయంలో శశికుమార్ ఆమె గొంతుకు చున్నీ వేసి చంపేశాడు.

ఈ హత్య కేసు విచారణ సమయంలో కీర్తిరెడ్డి పలు ఆసక్తికర విషయాలను చెప్పినట్టుగా సమాచారం.తమ కాలనీలోనే ఉన్న బాల్ రెడ్డితో తొలుత కీర్తిరెడ్డి ప్రేమలో పడింది. ఈ ప్రేమ విషయం తెలిసిన రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

కీర్తి రెడ్డి తన 16 ఏళ్ల వయస్సులోనే గర్భం దాల్చింది. గర్భం దాల్చితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే విషయమై ఆమె ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసింది. అంతేకాదు ప్రెగ్నీన్సీ కిట్ తెచ్చుకొని ఆమె పరీక్ష చేసుకొంది. ఈ టెస్టుల్లో కీర్తిరెడ్డి గర్భం దాల్చినట్టుగా తేలింది.

ఆ సమయంలో బాల్ రెడ్డి బెంగుళూరులో ఉన్నాడు.తాను గర్భం దాల్చినట్టుగా కీర్తిరెడ్డి బాల్ రెడ్డికి చెప్పింది. అబార్షన్ చేయించాలని బాల్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది.

అంతేకాదు శశికుమార్ కారులో బాల్ రెడ్డి కీర్తి రెడ్డిలు ఆమన్‌గల్ కు వెళ్లి కీర్తి రెడ్డికి అబార్షన్ చేయించారు. ఆమన్ గల్ కు వెళ్లే సమయంలో బాల్ రెడ్డి, కీర్తి రెడ్డి మాత్రమే కారులో వెళ్లారు. మధ్యలోనే శశికుమార్ ను దించేశారు.

ఆమన్‌గల్ లో ఉన్న తన స్నేహితుడు నాయక్ సహాయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. సంగారెడ్డిలో ఫంక్షన్ కు తీసుకెళ్తామని చెప్పి ఆమన్ గల్ కు తీసుకెళ్లి కీర్తిరెడ్డికి బాల్ రెడ్డి అబార్షన్ చేయించాడు.

అబార్షన్ తర్వాత కీర్తిరెడ్డి ఆమన్‌గల్ లో రెండు రోజుల పాాటు కీర్తి విశ్రాంతి తీసుకొంది. ఆ తర్వాత కీర్తిరెడ్డిని బాల్ రెడ్డి హయత్ నగర్ కు తీసుకొచ్చారు.

తల్లి రజితను హత్య చేసే సమయంలో కీర్తి రెడ్డి బీరు తాగింది. శశికుమార్  ఆమెకు బీర్ తాగించాడు. ఆ తర్వాత తల్లి మృతదేహన్ని రామన్నపేట రైలు పట్టాలపై వేసేందుకు వెళ్లే సమయంలో  కూడ ఆమె మద్యం తాాగింది.ఆమె ధైర్యంగా ఉండడానికి కీర్తిరెడ్డికి శశికుమార్ ఆమెకు మద్యం తాగించినట్టుగా కీర్తిరెడ్డి పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి

గతంలోనూ తల్లిని చంపేందుకు ప్లాన్, బలవంతంగా కీర్తిని వశపరుచుకున్న శశి

తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్

Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి