Asianet News TeluguAsianet News Telugu

కుమారీ ఆంటీ చెల్లెలిని చూశారా?

కూకట్ పల్లిలో ఫుడ్ బిజినెస్ చేస్తోంది కుమారీ ఆంటీ చెల్లెలు. తన అక్కను ట్రోల్ చేయద్దని కోరుతున్నారు. గత ఆరేళ్లుగా తాము కూడా ఇక్కడే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. 

Have you seen Viral Kumari Aunty's sister? - bsb
Author
First Published Feb 3, 2024, 2:44 PM IST | Last Updated Feb 3, 2024, 2:44 PM IST

హైదరాబాద్ : కుమారీ ఆంటీ.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్న పేరు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియా తలుచుకుంటే ఏం జరుగుతుందో మరో తాజా ఉదాహరణగా నిలిచింది. రోడ్డు సైడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమెను.. ఆమె ఫుడ్ ను చూపిస్తూ.. వీడియోలు చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. మీమర్స్ కి ఆమె ఓ మాంచి వ్యూస్, లైక్స్ తెచ్చే వస్తువయ్యింది. అంతే.. ఆమె చుట్టూ మూగారు.. ఇంటర్వ్యూలు చేశారు. ఫుడ్ గురించి వీడియోలు చేశారు. వారం రోజుల్లోనే ఆమె బిజినెస్ పెరిగిపోయింది. ఎక్కడెక్కడినుంచో జనాలు వచ్చారు. సెలబ్రిటీలూ వచ్చారు. 

కట్ చేస్తే.. ట్రాఫిక్ జాంలతో ఇబ్బంది అవుతుందని పోలీసులు ఆమె మీద కేసు పెట్టారు. ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు. దీంతో ఓ రోజంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. స్వయంగా తానే ఆమె దగ్గరికి వచ్చి భోజనం రుచి చూస్తానని చెప్పారు. ఆమె బిజినెస్ అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. అంతటితో కుమారీ ఆంటీ వివాదం సద్దుమణిగింది.

Kumari Aunty : అసలు ఎవరీ కుమారి ఆంటీ... ఏమిటా కథ..?

ఇక్కడితో కథ అయిపోలేదు. ఇప్పుడు యూట్యూబర్లు కుమారీ ఆంటీ చెల్లెలిని రంగంలోకి దింపుతున్నారు. కుమారీ ఆంటీ చెల్లెలు అంటూ మరో మహిళ మీద వీడియోలు చేస్తున్నారు. పాలకొల్లు నర్సాపూర్ కు చెందిన ఆమె గత ఆరేళ్లుగా కూకట్ పల్లి బాలాజీ హౌజ్ పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తోంది. ఇప్పుడు ఆమెను ఓ యూట్యూబర్ వీడియో తీసి పెట్టాడు. 

ఆమె వివరాలు చెప్పించారు. ఈ క్రమంలో ఆమె కుమారీ ఆంటీని ట్రోల్ చేయకండి నాన్నా.. అంటూ అభ్యర్థించింది. రోజుకు 150-200 వరకు భోజనాలు అమ్ముతానని చెప్పింది. ఈమె దగ్గర కుమారీ ఆంటీ దగ్గరున్నన్ని వెరైటీలు లేవు. కానీ, ఆహారం శుభ్రంగా, రుచిగా ఉందంటూ చూపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దీనిమీద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘కుమారీ ఆంటీని ఆగం చేశారు.. చెల్లెలంటూ ఈమెతో ఆపండి.. ఇంకా మరదలు, వదిన అంటూ వీడియోలు తీసి, వాళ్ల బిజినెస్ లు పాడు చేయకండి’ అని ఒకరంటే.. ‘రోడ్డు సైడు ఏదో బిజినెస్ చేసుకుని బతుకుతున్నారు వాళ్ల పొట్టకొట్టకండి’.. అంటూ మరొకరు స్పందించారు. ఇలా చిరువ్యాపారులను తమ వ్యూస్ కోసం ఇబ్బంది పెట్టొందంటూ అందరూ స్పందిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios