హైదరాబాద్: మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. కేటీఆర్ పక్కనే కూర్చొని మంత్రుల ప్రమాణస్వీకారాన్ని హరీష్ రావు చూశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్‌భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముందుగానే కేబినెట్‌లో చోటు దక్కిన ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుగానే వచ్చారు.

మరికొన్ని క్షణాల్లోనే మంత్రుల ప్రమాణం చేసే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజ్ భవన్ కు చేరుకొన్నారు. అప్పటికే అక్కడే ఉన్న కాబోయే మంత్రులు, పార్టీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో  హరీష్ రావు కరచాలనం చేశారు. గత టర్మ్ లో తనతో పాటు మంత్రులుగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటలను ఆలింగనం చేసుకొన్నారు.

ఆ తర్వాత ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో కూర్చొనేందుకు వెళ్లాడు. కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే ఎమ్మెల్యేలు ముందు వరుసలో కూర్చొన్నారు.

అయితే వెనుక వరుసలో కూర్చొన్న కేటీఆర్ పక్కనే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూర్చొన్నారు.  లక్ష్మారెడ్డి  కేటీఆర్ పక్కన నుండి లేచి సుఖేందర్ రెడ్డి పక్కన కూర్చొన్నాడు.

హరీష్ రావు కేటీఆర్ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పారు. హరీష్ రావు రాజ్ భవన్‌లోకి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, కాబోయే మంత్రులను చిరునవ్వుతూ పలకరించారు. హరీష్, కేటీఆర్ లు ఇద్దరూ పక్క పక్కనే కూర్చోని మంత్రుల ప్రమాణస్వీకారాన్ని తిలకించారు. 

సంబంధిత వార్తలు

ఆ ఇద్దరికీ తొలిసారే మంత్రి పదవులు

కేసీఆర్ కేబినెట్: ఆ రెండు జిల్లాలకు విస్తరణలో దక్కని చోటు

కేసీఆర్ వ్యూహం: హరీష్‌కు కేబినెట్‌లో దక్కని అవకాశం