హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్ లో సీనియర్లకు పెద్దపీట వేశారు. పలు దఫాలు ప్రజా ప్రతినిధులుగా పనిచేసినవారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. మరో వైపు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, మల్లారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది.

కేసీఆర్ కేబినెట్ లో ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఒక్క దఫా ఎంపీగా కూడ విజయం సాధించారు. పాలకుర్తి నుండి రెండు దఫాలు టీడీపీ, ఒక్క దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వరంగల్ ఎంపీగా దయాకర్ రావు ఉప ఎన్నికల్లో కూడ టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ దఫా మాత్రమే దయాకర్ రావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 

ఇంద్రకరణ్ రెడ్డి రెండు దఫాలు ఎంపీగా, నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరపున ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడ టీడీపీ నుండి సుమారు ఐదు దఫాలు విజయం సాధించారు. ఈ దఫా మాత్రమే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.

మేడ్చల్ నుండి మల్లారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా టీడీపీ నుండి మల్కాజిగిరి నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా మల్లారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది.

మరో వైపు వనపర్తి నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది. గత టర్మ్‌లోనే నిరంజన్ రెడ్డి వనపర్తి నుండి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆయన విజయం సాధించారు. దీంతో నిరంజన్ రెడ్డికి కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కింది.

గత టర్మ్‌లో కేసీఆర్ నిరంజన్ రెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు ఇచ్చారు. మహబూబ్ నగర్ నుండి వరుసగా విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్ కు ఈ దఫా కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కింది. గత టర్మ్ లో శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా తొలిసారిగా విజయం సాధించారు. గత టర్మ్‌లోనే ఆయనకు కేబినెట్ లో చోటు దక్కుతోందని భావించినా.. ఆయనకు మాత్రం కేబినెట్ లో చోటు లభించలేదు.

సూర్యాపేట నుండి వరుసగా రెండు దఫాలు విజయం సాధించిన జగదీష్ రెడ్డికి మరోసారి కేబినెట్ లో చోటు దక్కింది.తొలిసారిగా సూర్యాపేట నుండి గత టర్మ్ లో జగదీష్ రెడ్డి విజయం సాధించారు.

ఈటల రాజేందర్ సుమారు ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత టర్మ్‌లో ఈటల రాజేందర్ కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా కూడ పనిచేశారు. ఈ దఫా మరోసారి ఆయనకు చోటు దక్కింది. ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల ఈశ్వర్ కు తొలిసారి కేసీఆర్ కేబినెట్ లో అవకాశం దక్కింది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ కేబినెట్: ఆ రెండు జిల్లాలకు విస్తరణలో దక్కని చోటు

కేసీఆర్ వ్యూహం: హరీష్‌కు కేబినెట్‌లో దక్కని అవకాశం