ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. నామినేషన్ దాఖలు చేసిన అగ్రనేతలు..

తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నేడు బీఆర్ఎస్ పార్టీ హేమాహేమీలంతా నామినేషన్లు దాఖాలు చేశారు. ఎవరెవరు ఎక్కడ నామినేషన్లు దాఖలు చేశారంటే.? 

harish rao  filed  nomination in siddipet KRJ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఇక కొద్దిగంటలే గడువు మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీల హేమాహేమీలంతా నేడు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్దమవుతున్నారు. గురువారం నాడు మంచి మూహుర్తం ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ ఊపంకుంది. గజ్వేల్ లో గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖాలు చేయగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ దాఖాలు చేశారు.

ఈ రోజు ఉదయాన్నే మంత్రి హరీష్ రావు కొండగట్టు అంజన్న స్వామిని దర్శనం చేసున్నారు. అనంతరం సిద్దిపేటకు చేరుకున్న ఆయన పట్టణంలోని మోహిన్ పుర వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ల ప్రతాలపై సంతకాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖాలు చేశారు. మరోవైపు.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు.ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్లా ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios