Asianet News TeluguAsianet News Telugu

కూలీ నెంబర్ వన్ ... హరీశ్ రావే

టిఆర్ ఎస్ ప్లీనరీ కోసం నిధుల సమీకరణలో భాగంగా సాగిన ‘గులాబీ కూలీ వారోత్సవాలు’ లో రు.8.62 లక్షలు సంపాదించి నీటిపారుదల శాఖ మంత్రి కూలీనెంబర్ 1 గా వచ్చారు.

Harish Rao emerges coolie number one during in TRS

 

తెలంగాణా రాష్ట్రసమితి మంత్రులు, ఎంపిలు,  ఇతర నాయకులు పార్టీ ప్లీనరీకోసం ఎలా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. జ్యూస్ అమ్మే వాళ్లు కొందరు, బట్టల వ్యాపారం చేసే వాళ్లు ఇంకొందరు. కొందరు రైతు నాయకులు బస్తాలు మోసి నిజంగా చెమటోడ్చి నాలుగు రాళ్లుపార్టీ కోసంజమచేస్తున్నారు.

 

అందరిలోకి ఇంతవరకు బాగా కష్టపడి ఎక్కువ డబ్బు వరంగల్ లో చీరలు అమ్మి హరీశ్ రావు మొత్తం రూ.8.62 లక్షలు సంపాదించారు. నిజామాబాద్ లోక్ సభ ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురిలలో శ్రమించారు. అమె అక్కడ చీరల వ్యాపారం చేసి, హాస్పిటల్ లో మందులు అమ్మి రూ.6లక్షలు సంపాదించారు.

 

ఐటి మంత్రి కెటి రామారావు సుచిత్ర వద్ద లాస్ వెగాస్ డైనర్స్ లో  ఐస్ క్రీమ్ అమ్మి రు.7.30 లక్షలు పార్టీ కోసం  ఆర్జించారు. 

 

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరుకు తగ్గ కూలీ గిట్టుబాటు కాలేదు.బంజారాహిల్స్ ఒమెగా కేన్సర్ హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసినా ఆయనకు వచ్చింది కేవలం  రూ.2లక్షలే. ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు సీతాఫల్ మండి డివిజన్ చిలకలగూడ గాంధీ చౌక్ లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో  దోశెలు వేసి.. వెయిటర్ గా పనిచేసి మూడున్నర లక్షలు సంపాదించారు. హోమ్ మంత్రి కంటే మేలే.

 

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పనితనం కూడా అంతంత మాత్రమే.సూర్యాపేటలో ఆయన చేసిన పనికి రాలింది  రూ.1.50లక్షలు మాత్రమే.

 

నల్గొండ లోక్ సభ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, పురపాలిక అధ్యక్షురాలు తిరునగరు నాగలక్ష్మి మిర్యాలగూడ పట్టణంలోని శ్రీరామకృష్ణ రైస్‌ మిల్లులో ధాన్యం బస్తాలు మోయగా వచ్చింది రూ.2.11 లక్షలే.  నకిరేకల్‌ ఎమ్మెల్యే వేములవీరేశం నాయకులతో కలిసి ఇనుపాముల గ్రామశివారులో ఉన్న కంకరమిల్లులో కూలీపని చేశారు. పదివేలు సంపాదించారు.

 

 

వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్ బాన్స్ వాడ మార్కెట్ యార్డులో  బస్తాలు మోసి రెండులక్షలు సంపాదించారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios