Asianet News TeluguAsianet News Telugu

పల్లవి ప్రశాంత్ కు హరీష్ రావు కంగ్రాట్స్...

ఈ విజయానికి  హరీష్ రావు లాంటి రాజకీయ ప్రముఖులు ట్వీట్ చేయడంతో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. 

Harish Rao congrats to Pallavi Prashant on twitter - bsb
Author
First Published Dec 18, 2023, 2:19 PM IST

సిద్దిపేట : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ సారి బిగ్ బాస్ విన్నర్ గా తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లవి ప్రశాంత్  నిలిచాడు. 105 రోజులపాటు ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్ లో 19 మంది కంటెస్టెంట్లతో పోటీపడి…సామాన్యుడిగా, రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీగా మారిపోయాడు. దీనిమీద మాజీ మంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. 

ట్విట్టర్ వేదికగా పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా సిద్దిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలవడం సంతోషం కలిగించింది. మారుమూల పల్లెలో పొలం పనులు చేసుకునే ఓ వ్యక్తి బిగ్ బాస్ వరకు వెళ్లడం…అందరి హృదయాలను గెలుచుకుని విజేతగా నిలవడం సంతోషదాయకం. ఈ రైతుబిడ్డ  సామాన్యుల దృఢ సంకల్పానికి  నిదర్శనంగా నిలిచారు’ అంటూ హరీష్ రావు పల్లవి ప్రశాంత్ ఫోటోను షేర్ చేశారు.

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్

ఈ విజయానికి  హరీష్ రావు లాంటి రాజకీయ ప్రముఖులు ట్వీట్ చేయడంతో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. కాగా, మరోవైపు ఫినాలే ముగియగానే… రన్నర్ గా నిలిచిన అమర్దీప్, విన్నర్  ప్రశాంత్ అభిమానుల మధ్య తీవ్ర  వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. అమరదీప్ వాహనంపై అభిమానులు దాడి చేశారు. అటుగా వెడుతున్న బస్సులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆరు బస్సులు ధ్వంసం అయ్యాయి. దీని గురించి తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులైన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios