Asianet News TeluguAsianet News Telugu

అటువైపు నుంచి హరీష్ ఆపరేషన్ (వీడియో)

  • నిద్ర తప్ప మిగతా సమయం జనంలోనే
  • సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో బిజి బిజి
  • రాత్రి వేళల్లోనూ ప్రాజెక్టుల వద్ద హల్ చల్
  • రికార్డుల మోతకు ఆయన పనితీరే గీటురాయి
Harish is silently emerging as a grass root level leader

ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఓటమెరగని నాయకుడు. డైనమిక్ లీడర్ గా పేరుగాంచారు. సిద్ధిపేట గడ్డ మీద మామను మించిన అల్లుడు అనిపించుకున్నారు హరీష్. తెలంగాణలోనే భారీ మెజార్టీ సాధించి గెలిచిన నేతల్లో హరీష్ తొలి నాయకుడు. తెలంగాణ కోసం జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు తెలంగాణ చరిత్రలోనే ఎవరు సాధించని రీతిలో ఓట్లు సాధించి రికార్డుల మోత మోగించారు. 2010 ఉప ఎన్నికల్లో 95,878 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేశారు. అప్పుడు ఏదో సెంటిమెంట్ తో గెలిచాడులే అనుకునే అవకాశమే లేకుండా.. తర్వాత 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం 93,328 ఓట్లతో విజయం సాధించారు హరీష్. సిద్ధిపేటలో ఇప్పటి వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయాలు నమోదు చేశారు హరీష్ రావు. అంతకంటే ముందు సిద్ధిపేట నియోజకవర్గంలో కేసిఆర్ ఆరు సార్లు పోటీ చేసి చేసి ఐదుసార్లు గెలుపొందగా ఒకసారి ఓటమిపాలయ్యారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్ చేతిలో టిడిపి నుంచి పోటీ చేసిన కేసిఆర్ ఓడిపోయారు. అయితే మదన్ మోహన్ కు వచ్చిన మెజార్టీ అతి స్వల్పమే.

రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా హరీష్ పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు మైనింగ్ శాఖ కూడా ఉండేది. కానీ అది ఇప్పుడు కేటిఆర్ చేతికి పోయింది. అప్పట్లో మైనింగ్ శాఖను హరీష్ నుంచి తొలగించడం పట్ల చర్చ కూడా జరిగింది. కానీ తనకున్న పని భారం వల్ల మైనింగ్ శాఖను వదులుకున్నట్లు హరీష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు హరీష్ టార్గెట్ అంతా ప్రాజెక్టులపైనే ఉంది. నిత్యం సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి లేదు.. పగలు లేదు ఎప్పటిపకప్పుడు పనులు వేగంగా పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో... సామాన్య ప్రజలతో మమేకమవుతూ హరీష్ తన ఆపరేషన్ చేస్తున్నారు.

ఇక్కడ తెలంగాణ మంత్రివర్గంలో టాప్ లెవల్ లో ఉన్న వారిలో సిఎం కేసిఆర్ తర్వాత మంత్రి కేటిఆర్, ఆ తర్వాత హరీష్ రావే ఉంటారని సర్వత్రా జరుగుతున్న చర్చ. అయితే సిఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ ఇద్దరూ టాప్ లెవల్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. కానీ హరీష్ మాత్రం గ్రాస్ రూట్ పాలిటిక్స్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. గత మూడున్నర ఏళ్ల కాలంలో హరీష్ తిరిగినంతగా.. జనాల్లో ఏ తెలంగాణ నాయకుడు కూడా తిరిగిన దాఖలాలు లేవు. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న నేతలెవరూ తిరగలేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నాలుగైదు గంటలు నిద్రించే సమయం మినహా హరీష్ ఎప్పుడూ జనాల్లోనే ఉంటారన్న పేరుంది. హరీస్ తో పోలిస్తే కేటిఆర్ కూడా అహర్నిషలు పనిచేసినా.. హరీష్ మాదిరిగా మాస్ వర్క్ కాకుండా ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తారని చెబుతారు. అందుకే హరీష్ రావుకు వచ్చిన మాస్ లీడర్ పేరు ఇంకా కేటిఆర్ కు రాలేదు. ఇక కేసిఆర్ పాలిటిక్స్ అంతా వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తుంటారు. కేసిఆర్.. కేటిఆర్ ఆపరేషన్స్ పైనుంచి నడిపితే హరీష్ మాత్రం కింది నుంచి నడుపుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారు. అందుకే ఒక్క సిద్ధిపేటలోనే కాకుండా తెలంగాణ అంతటా హరీష్ రావు మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని పార్టీ కేడర్ లో చర్చ.

హరీష్ రావు ప్రాజెక్టుల పర్యటన జరిపితే ఆయనను చూసేందుకే వందలు వేలుగా జనాలు ఇరగబడి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఏ జిల్లాలో కాలు పెట్టినా జనాలు ఎగబడుతున్నారు. హరీష్ రావు ఇటీవల ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా జనాలు ఎలా దుమ్ము రేపుతూ ఆయనతో నడిచారో ఈ కింది వీడియోలో చూడొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios