ఇక్కడ మంత్రి హరీష్ ఏం చేసిండో తెలుసా ?

Harish fulfills dream of  girl student by posing for a photo with her
Highlights

  • హరీష్ రావుతో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన చిన్నారి
  • పెద్దగా ఏడ్చిన చిన్నారిని ఓదార్చిన హరీష్
  • ఫొటో దిగడంతో చిన్నారి హ్యాప్పీ

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చిన్నారితో మంత్రి హరీష్ రావు ఫొటో దిగారు. ఉత్తగా ఫొటో దిగుడే గొప్పనా అనుకోవచ్చు. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ స్టోరీ కింద చదవండి.

దివ్య అనే విద్యార్థినిది సంగారెడ్డి జిల్లాకు చెందిన నారాయణ్‌ఖేడ్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్‌సాన్‌పల్లి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఎప్పటి నుంచో మంత్రి హరీష్ తో ఫోటో దిగాలని దివ్య ఎదురుచూస్తూ ఉంది. సడెన్ గా మంత్రి న్యూ ఇయర్ వేడుకలకు రావడంతో ఆ పాప.. సార్ తో పోటో దిగాలన్నది తన కోరిక అని.. ఎప్పుడూ నెరవేరలేదు అంటూ ఎంతో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంది.

చిన్నారి నుంచి ఊహించని స్పందన రావటంతో మంత్రి హరీశ్ వెంటనే చలించిపోయారు. స్టేజ్ దిగి పాప దగ్గరికి వెళ్లారు. చిన్నారిని ఓదార్చి పక్కనే కూర్చుని నేనున్నానని ధైర్యం చెప్పారు. తనతో కలసి ఫొటోలు దిగారు. తనతో ఫోటో దిగడంతో ఉద్వేగానికి లోనైన చిన్నారి కన్నీళ్లను తుడిచారు హరీష్ రావ్. లీడర్ అంటే హరీష్ రావే అని అక్కడున్నవారంతా చర్చించుకున్నారు.

loader