మహానాడుకు ఎందుకు వెళ్లలేదంటే జవాబు దాటేసిన హరికృష్ణ

Harikrishna evades answer to the question
Highlights

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఎందుకు వెళ్లలేదంటే మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ జవాబు దాటేశారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఎందుకు వెళ్లలేదంటే మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ జవాబు దాటేశారు. ఇది తనకు దేవాలయమని మాత్రమే ఆయన జవాబిచ్చారు. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన సోమవారం ఉదయం ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. 

ఎన్టీఆర్ ఘాట్‌కు నందమూరి హరికృష్ణతో ఆయన తనయులు, సినీ హీరోలు కల్యాణ్‌రామ్, జా. ఎన్టీఆర్ తదితరులు సోమవారం ఉదయం వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ తదితర సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. 

తెలుగు జాతి కోసం పోరాడిన ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇరు రాష్ట్రాల పాఠ్యాంశాల్లో ఉండాలని హరికృష్ణ అన్నారు. నవరత్నాల్లో వజ్రం గొప్పదని, అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి చేసిన సేవలు గొప్పవని అన్నారు. 

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఎర్రకోట మీద జెండా ఎగురేశారని, తెలుగుజాతి ఓ భాష ఉందని నిరూపించారని అన్నారు.

loader