నవీన్ పేరేంట్స్ కు క్షమాపణలు చెప్పిన హరిహరకృష్ణ తండ్రి
నవీన్ ను తన కొడుకు హరిహరకృష్ణ హత్య చేయడం తప్పేనని తండ్రి ప్రభాకర్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దన్నారు.
వరంగల్: తన కొడుకు నవీన్ ను హత్య చేయడం తప్పేనని హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ చెప్పారు. ఈ తప్పిదం చేసినందుకు నవీన్ తల్లిదండ్రులను బహిరంగంగా క్షమాపణ కోరాడు హరిహరకృష్ణ తండ్రి. హరిహరకృష్ణ తన కొడుకైనంత మాత్రాన అతను చేసిన తప్పును తాను సమర్ధించబోనన్నారు. ఈ నెల 23వ తేదీన తనకు ఈ విషయం తెలిసిందన్నారు.
నవీన్ ను హత్య చేసే విషయంలో హరిహరకృష్ణకు ఇతరులు ఎవరైనా సహయం చేసి ఉండొచ్చని ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేశారు. నవీన్, హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులని ఆయన చెప్పారు. వీరిద్దరితో పాటు యువతి కూడా వీరితో స్నేహంగా ఉండేదన్నారు. ఈ ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉండేవారన్నారు. కానీ వీరిద్దరి మధ్య గొడవకు ఆ అమ్మాయే కారణమన్నారు. ఈ ఇద్దరిని ఆ యువతి వాడుకుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నెల 17వ తేదీన నవీన్ ను హరిహరకృష్ణ దారుణంగా హత్య చేశాడు. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 24వ తేదీన అబ్దుల్లాపూర్ పోలీసులకు హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. హరిహరకృష్ణ లొంగిపోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. హరిహరకృష్ణ తానే నవీన్ ను హత్య చేసినట్టుగా పోలీసులకు చెప్పాడు. నవీన్ శరీర బాగాలను వేరు చేసి వాటిని ఫోటోలు తీసి తన లవర్ కు వాట్సాప్ లో షేర్ చేశాడు.
also read:నవీన్ హత్యకేసు: నిందితుడు హరిహర వాట్సాప్ పై పోలీసుల ఆరా
ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు బావిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.