నవీన్ హత్య కేసు: 9 నెలల ప్రేమ కోసం 'ఫ్రెండ్‌ను చంపిన హరిహరకృష్ణ

అబ్దుల్లాపూర్ మెట్  నవీన్ హత్య  కేసులో  పోలీసులు  కీలక విషయాలను  గుర్తించారు.  హరిహరకృష్ణ కన్ఫెన్షన్ స్టేట్ మెంట్  లో  పలు  అంశాలను  పోలీసులు ప్రస్తావించారు. 

Harihara Krishna Confession Statement Reveals Key information In Naveen Murder Case

హైదరాబాద్:అబ్దుల్లాపూర్‌మెట్  నవీన్ హత్య  కేసులో  రోజుకో  విస్తుగొలిపే విషయం బయటకు వస్తుంది.  తొమ్మిది మాసాల  ప్రేమకు  తన  స్నేహితుడు నవీన్ ను  అత్యంత పాశవికంగా హత్య  చేశాడు  హరిహరకృష్ణ .

తన లవర్ కోసం  హరిహరకృష్ణ   ఈ హత్య  చేశాడు.  2023 ఫిబ్రవరి  16వ తేదీన  నవీన్ ను హత్య చేయాలని హరిహరకృష్ణ ప్లాన్  చేశాడు. కానీ  ఆ రోజు  నవీన్ ను హత్య  చేయడం  సాధ్యం కాలేదు.  దీంతో గత నెల  17వ తేదీన  నవీన్ ను పథకం ప్రకారంగా  హత్య  చేశాడు. నవీన్ హత్య  కేసుకు సంబంధించిన  కన్ఫెన్షన్ స్టేట్ మెంట్ లో  ఈ విషయాన్ని హరిహరకృష్ణ  ఒప్పుకున్నాడు   వారం రోజుల పాటు  హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని  విచారించారు.ఈ విచారణలో  కీలక విషయాలను గుర్తించారు పోలీసులు. నవీన్  హత్య  విషయం తెలిసి  కూడా  ఈ విషయం  పోలీసులకు చెప్పకపోడంతో  హరిహరకృష్ణ లవర్,  హరిహరకృష్ణ  స్నేహితుడు హసన్ ను  పోలీసులు  ఈ నెల  6వ తేదీన  అరెస్ట్ చేశారు. 

నవీన్,  హరిహరకృష్ణ,  హరిహరకృష్ణ  లవర్  ఒకే కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు.  ఇంటర్ చదివే రోజుల్లోనే  నవీన్ , ఆ యువతి  ప్రేమించుకున్నారు. ఈ విషయం  హరిహరకృష్ణకు  కూడా  తెలుసు . అయితే  వీరిద్దరి మధ్య  బంధం తెగిపోయింది.  అయితే  9 మాసాల క్రితం  హరిహరకృష్ణ తన  లవ్  ప్రపోజల్ ను  యువతికి  చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది.  అయితే  ఈ సమయంలో  కూడా   నవీన్  ఆ యువతికి ఫోన్  చేయడం  హరిహరకృష్ణ దృష్టికి వచ్చింది. ఈ విషయం హరిహరకృష్ణకు  నచ్చలేదు. దీంతో  నవీన్ ను హత్య  చేయాలని  హరిహరకృష్ణ  నిర్ణయం తీసుకన్నాడు.  రెండు మాసాల నుండి  నవీన్ హత్య  కోసం  హరిహరకృష్ణ  ప్రణాళిక వేశాడు.  మలక్ పేటలోని  డీమార్ట్ లో  హరిహరకృష్ణ కత్తిని కొనుగోలు  చేశాడు.  నవీన్ ను  హైద్రాబాద్ కు రప్పించి  హత్య  చేశాడు. ఫిబ్రవరి  16వ తేదీన  నవీన్ ను  హత్య  చేయాలని  హరిహరకృష్ణ  భావించాడు. కానీ   ఆ రోజున  హత్యకు వీలు పడలేదు. 

also read:నవీన్ హత్య కేసు: శరీర భాగాలు దగ్దం చేసి బిర్యానీ తిన్న హరిహరకృష్ణ

దీంతో  ఫిబ్రవరి  17న   నవీన్ ను అబ్దుల్లాపూర్ మెట్  సమీపంలో  హరిహరకృష్ణ హత్య  చేశాడని  ఈ కన్ఫెన్షన్ స్టేట్ మెంట్  తెలిపిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ కేసులో  తాను  పోలీసులకు దొరకనని  హరిహరకృష్ణ ధీమాగా  ఉన్నాడని  ఈ కథనం తెలిపింది.  హత్య  తర్వాత  హరిహరకృష్ణ, హసన్, హరిహరకృష్ణ లవర్  కలుసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios