భార్య, పిల్లలను హత్యచేసిన హరీందర్‌గౌడ్ సూసైడ్, ఎందుకంటే?

Hareendar goud commits suicide in meerpeta
Highlights

మీర్‌పేట జిల్లెలగూడలో  హరీందర్ గౌడ్  అనే వ్యక్తి బుధవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఆరు మాసాల క్రితం హరీందర్ గౌడ్  భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు.  ఈ కేసులో అరెస్టై  బెయిల్‌పై ఇటీవలనే విడుదలయ్యాడు.

హైదరాబాద్: హైద్రాబాద్‌ మీర్‌పేట జిల్లెలగూడలో  హరీందర్ గౌడ్  అనే వ్యక్తి బుధవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఆరు మాసాల క్రితం హరీందర్ గౌడ్  భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు.  ఈ కేసులో అరెస్టై  బెయిల్‌పై ఇటీవలనే విడుదలయ్యాడు.

ఈ ఏడాది ఉగాది పండుగ రోజున అత్తింటికి వెళ్లిన హరీందర్ గౌడ్ అక్కడే ఉన్న భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు నితీష్, సహస్రలను దారుణంగా హత్య చేశాడు. అత్త, మామలను బయటకు పంపి ప్లాన్ ప్రకారంగా భార్య, పిల్లలను హత్య చేశాడు.

చిన్న గొడవ కారణంగా భార్య, పిల్లలను హత్య చేశాడు హరీందర్ గౌడ్.  ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్  చేశారు. జైలులో శిక్షను అనుభవించిన హరీందర్ గౌడ్  ఇటీవలనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఓ గదిలో  ఒంటరిగా హరీందర్ గౌడ్ నివాసం ఉంటున్నాడు.

అయితే భార్య, పిల్లలను చంపాననే మానసిక క్షోభతో హరీందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని  స్థానికులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారామిచ్చారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కులకచర్లకు చెందిన హరిందర్ గౌడ్ జిల్లెల‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  గతంలో మలక్‌పేటలో డెంటల్ ల్యాబ్ నిర్వహించిన హరీందర్‌గౌడ్ ఏడాదికాలంగా పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.  ఈ విషయమై  కుటుంబసభ్యుల మధ్య తరచూ ఘర్షణ జరిగేది దీంతో భార్య, భర్తల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన భార్య, పిల్లలను  హత్య చేశారు. 


 

loader