నిజామాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితపై అభిమానంతో ఓ వ్యక్తి ఆమె బొమ్మతో బంగారు లాకెట్ చేయించుకొన్నాడు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం బినోల సోసైటీ ఛైర్మెన్ గా  మగ్గారి హన్మాండ్లు పనిచేస్తున్నాడు. కవిత అంటే ఆయనకు విపరీతమైన అభిమానం.

also read:నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కవితకు మంత్రి పదవి దక్కేనా?

ఈ అభిమానంతో ఆయన ఏడు గ్రాముల బంగారంతో  ఆమె బొమ్మతో లాకెట్ చేయించుకొన్నాడు.  నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి కవిత పోటీ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో కవిత విజయం సాధిస్తోందనే ధీమాతో ఈ లాకెట్ చేయించుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

గతంలో కవిత పేరును ఆయన తన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకొన్నాడు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే.