Asianet News TeluguAsianet News Telugu

చావడానికైనా సిద్ధమే.. ప్రతిదాడులు వద్దు : గువ్వల బాలరాజు

ఓడిపోతామన్న భయంతోనే కిరాయిగూండాలతో తనమీద దాడి చేయిస్తున్నాడని చిక్కుడు వంశీకృష్ణమీద గువ్వల బాలరాజు మాటల యుద్ధానికి దిగారు. 

guvvala balaraju Controversial comments  - bsb
Author
First Published Nov 14, 2023, 8:36 AM IST

అచ్చంపేట : బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు తన మీద దాడిపై స్పందించారు. గువ్వల బాలరాజ్ మీ కోసం వంద సార్లు చావడానికైనా సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చారు. దాడులకు ప్రతిదాడులు సమాధానం కాదు.. ఎన్నికల్లో ఓటువేసి, గెలిపించి చెప్పుతో కొట్టినట్టు రిజల్ట్స్ చూపించాలి.. అన్నారు. కాంగ్రెస్  క్రిమినల్ చిక్కుడు వంశీకృష్ణ దగ్గర డబ్బులు ఉన్నాయి. అచ్చంపేట ప్రజలు మోసపోవద్దు..వాడు మద్యం తాగిపిస్తాడు బీఆర్ఎస్ వాళ్ళని చంపేస్తే మనం గెలిచేయవచ్చు అనే నెపంతో దాడులు చేయమంటాడు.. అని చెప్పుకొచ్చారు.

కారు గుర్తుకు ఓటేయ్యండి.. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టండి అని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా సోమవారం అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ గుండాలు అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బాలరాజు చేతికి గాయమయ్యింది. 

అంతకు ముందు ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చిక్కుడు వంశీకృష్ణ ఏడుస్తున్నాడు అతనికి ప్రచారానికి మంది వెళ్లట్లేదు అతను చెప్పే మాయమాటల్ని ఎవరు నమ్మట్లేదు.. ఆ ఏడుపుతో ఏం చేయాలో తెలియక ఉన్న డబ్బునంత కిరాయి రౌడీలకు గుండాలకు ఇస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ప్రజల్ని మొత్తం భయభ్రాంతులకు గురిచేసి ఒక రౌడీగా గెలవాలనుకుంటున్నాడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios