సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్  రాజీనామా చేశారు.

Manohar Lal Khattar resigns as CM of Haryana lns

న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్  మంగళవారంనాడు రాజీనామా చేశారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. హర్యానా రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ సంకీర్ణంలో విభేదాలు నెలకొన్నాయనే వార్తలు కూడ వచ్చాయి..ఈ పరిణామాల నేపథ్యంలో  హర్యానా సీఎం ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....

లోక్‌సభ ఎన్నికల విషయంలో రాష్ట్రంలో బీజేపీ, జేజేపీ మధ్య సీట్ల షేరింగ్ విషయంలో  ఏకాభిప్రాయం కుదరలేదు. దరిమిలా  రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం సాగుతుంది.  2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని  10 ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.  

also read:సికింద్రాబాద్- విశాఖ రూట్‌లో మరో రైలు: కొత్తగా 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన మోడీ

ఈపరిణామాల నేపథ్యంలొో సీఎం పదవికి  మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో ఖట్టర్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. 

also read:40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో  గవర్నర్ బండారు దత్తాత్రేయతోన  మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ఖట్టర్ తో పాటు ఆయన మంత్రివర్గం రాజీనామాను సమర్పించింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో  హర్యానా రాష్ట్రంలో జేజేపీ 10 స్థానాల్లో  విజయం సాధించింది. బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలున్నారు.  హర్యానా అసెంబ్లీలో మొత్తం  ఎమ్మెల్యేల సంఖ్య 90 మంది.

also read:పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి,పది మందికి గాయాలు

.హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా,  పార్టీ పరిశీలకులు తరుణ్ చుగ్ హర్యానాకు చేరుకున్నారు.  బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios