తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హఫీజ్ పేపట భూ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ ముఠా నాయకుడిని శ్రీనుగా గుర్తించారు పోలీసులు.

గుంటూరుకు చెందిన మాదాల శ్రీను.. భూమా అఖిలప్రియ కుటుంబానికి అన్ని తానై వెన్నంటి వుంటాడు. నంద్యాల ఉప ఎన్నికలో గుంటూరు శ్రీనే  కీలకంగా వ్యవహరించాడు. ఇక శ్రీను.. లగ్జరీ జీవితం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

Also Read:అఖిలప్రియ కేసు: ఫిల్మ్ నగర్‌లో అద్దెకు పోలీస్ డ్రెస్, కిడ్నాపర్ల పక్కా స్కెచ్

సరదా కోసం హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టే గ్రాండ్ లైఫ్ స్టైల్ శ్రీనుది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆయన కిడ్నాప్ ఎలా చేయాలి..? ఎలా వెళ్లాలి..? అనేదానిపై శ్రీను స్కెచ్ ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తోంది.

సినీ ఫక్కీలో నవీన్ రావు తదితరుల కిడ్నాప్‌కు అతను ప్లాన్ చేశాడు. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్న శ్రీను ముఠా.. ఆ తర్వాత ప్లాన్‌ను అమలు చేసింది.

భార్గవరామ్‌కు రైట్ హ్యాండ్‌గా..అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగిన వ్యక్తిగా కీలక అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు మాదాల శ్రీను. ఇక శ్రీను నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.