బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రవీణ్ రావు సోదరుల వాంగ్మూలాన్ని మరోసారి తీసుకున్నారు బోయిన్‌పల్లి పోలీసులు. అలాగే కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు సేకరించారు. ఫిల్మ్‌నగర్‌లోని డ్రామా డ్రెస్ కంపెనీలో కిడ్నాపర్లు దుస్తులు అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రవీణ్ రావు సోదరుల వాంగ్మూలాన్ని మరోసారి తీసుకున్నారు బోయిన్‌పల్లి పోలీసులు. అలాగే కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు సేకరించారు.
ఫిల్మ్‌నగర్‌లోని డ్రామా డ్రెస్ కంపెనీలో కిడ్నాపర్లు దుస్తులు అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను సైతం సేకరించినట్లుగా సమాచారం.
పోలీసుల దుస్తులతో పాటు ఐటీ అధికారులకు నమ్మించేందుకు వాటిని అద్దెకు తీసుకున్నారు. ప్రవీణ్, సునీల్, నవీన్‌లను ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో వుంచారు. ఐటీ కార్యాలయానికి రావాలంటూ ఒకరికి తెలియకుండా మరొకరిని కారులో ఎక్కించుకుని వెళ్లారు కిడ్నాపర్లు.
Also Read:సుబ్బారెడ్డినే చంపాలనుకుంది.. మేమెంత: అఖిలప్రియపై నవీన్ రావు బంధువు వ్యాఖ్యలు
మంగళవారం రాత్రి 11 గంటలకు కూకట్‌పల్లిలోని అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆ తర్వాతే ప్రవీణ్ రావు సోదరులను వదిలేశారు కిడ్నాపర్లు.
కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు. ఉదయం అఖిలప్రియకు ఫిట్స్ వచ్చాయని.. రాత్రి నుంచి అఖిలప్రియ ఎలాంటి అల్పాహారం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.
ఉదయం మందులు వేసుకోలేదని.. ఏమీ తినకపోవడంతో నీరసంగా వున్నారని చెప్పారు. అఖిలప్రియకు సిబ్బంది నచ్చజెప్పి సాంబార్ రైస్ తినిపించారని అధికారులు తెలిపారు.
