మియాపూర్ లోని ఓ రెస్టారెంట్ జనరల్ మేనేజర్ పై ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స అందించేలోపే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ లోని మియాపూర్ లో బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. స్థానికంగా కలకలం రేకెత్తించిన ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని కూడా గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు.

చందమామ అందిన వేళ.. సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ .. ‘‘సైకిల్ సే.. చాంద్ తక్ ’’ అంటూ..

వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మదీనాగూడలో సందర్శిని ఎలైట్‌ అనే పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. అందులో కోల్ కతాకు చెందిన 35 ఏళ్ల దేవేందర్‌ గాయన్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి అతడిపై రిత్విక్ అనే వ్యక్తి నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.

యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేసిన భర్త.. బిడ్డ క్షేమం.. తల్లి మృతి

వెంటనే స్థానికులు దేవేందర్ ను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గ మధ్యలోనే ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ కాల్పుల ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుున్నారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సందీప్ రావు, ఏసీపీ నరసింహారావు సందర్శించారు. కాగా అక్రమ సంబంధం కారణంగానే ఈ కాల్పులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ కేసులో నిందితుడైన రిత్విక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.