కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి.. గాల్లోకి కాల్పులు జరపకుండానే గన్ మిస్ ఫైర్
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల ఈశ్వర్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. గాల్లోకి కాల్పులు జరపడానికి ముందే గన్ మిస్‌ఫైర్ అయ్యింది.

మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల ఈశ్వర్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. గాల్లోకి కాల్పులు జరపడానికి ముందే గన్ మిస్‌ఫైర్ అయ్యింది. అయితే తుపాకీ పేలినా ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. కొప్పుల హరీశ్వర్ రెడ్డి (78) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994, 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997- 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా సేవలందించారు.
ALso Read: KOPPULA HARISHWAR REDDY: పరిగి ఎమ్మెల్యే కొప్పుల ఇంట విషాదం.. మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత..
తెలంగాణ ఉద్యమం సమయంలో తెలుగుదేశం పార్టీని వీడిన కొప్పులు తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ చేరారు. అనంతరం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు.