Asianet News TeluguAsianet News Telugu

KOPPULA HARISHWAR REDDY: పరిగి ఎమ్మెల్యే కొప్పుల ఇంట విషాదం.. మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత.. 

 KOPPULA HARISHWAR REDDY: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి, మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) కొప్పుల హరీశ్వర్ రెడ్డి (78) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. 

former deputy speaker koppula harishwar reddy passed away KRJ
Author
First Published Sep 23, 2023, 12:48 AM IST

KOPPULA HARISHWAR REDDY: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి, మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) కొప్పుల హరీశ్వర్ రెడ్డి (78) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కొప్పుల మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. 

కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994, 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1997- 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా సేవలందించారు
 
ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ చేరారు. అనంతరం  టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios