సరూర్‌నగర్ సీనియర్ జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్‌కు గురయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి మణిశర్మను కాపాడారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ షాప్ యాజమానే ఆయనను అపహరించాడు. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సరూర్‌నగర్ సీనియర్ జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్‌కు గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు బుధవారం బయల్దేరారు మణిశర్మ. అయితే సదరు షాప్ యజమాని, మరో ముగ్గురు కలిసి మణిశర్మను కిడ్నాప్ చేసి ఆయనపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి మణిశర్మను కాపాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.