Asianet News TeluguAsianet News Telugu

'స్మైల్ డిజైనింగ్' సర్జరీ వికటించి వరుడు మృతి...

ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో 28 ఏళ్ల లక్ష్మీ నారాయణ వింజమ్ 'స్మైల్ డిజైనింగ్' ప్రక్రియలో మరణించాడు.
 

Groom dies after 'smile designing' surgery goes awry, Telangana - bsb
Author
First Published Feb 20, 2024, 2:05 PM IST | Last Updated Feb 20, 2024, 2:05 PM IST

హైదరాబాద్ : పెళ్లికి అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని అనుకోని వారు ఉండరు. అలా అనుకున్న ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో వెలుగు చూసింది.  28 ఏళ్ల వింజం లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి 'స్మైల్ డిజైనింగ్' చేయించుకునే క్రమంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెడితే.. 

లక్ష్మీనారాయణకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం జరిగింది. అయితే, అతని పళ్ల మధ్య సందులు ఉంటాయి. నవ్వినప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని సరిచేయించుకోవాలని.. పెళ్లిలో అందంగా కనిపించాలని అనుకున్నాడు. దీనికోసం 'స్మైల్‌ డిజైనింగ్‌' చికిత్స చేయించుకోవాలనుకున్నాడు. దీనికోసం ఫిబ్రవరి 16న హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ డెంటల్‌ క్లినిక్‌ ను సంప్రదించాడు. 'స్మైల్‌ డిజైనింగ్‌' చికిత్స చేయించుకోవాలనుకున్నాడు.

టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

ఈ క్రమంలో... అనస్థీషియా ఓవర్ డోస్ వల్లే చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి ఆరోపించారు. సర్జరీ సమయంలో కొడుకు స్పృహతప్పి పడిపోవడంతో సిబ్బంది తనకు ఫోన్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారని వింజం రాములు తెలిపారు. "వెంటనే లక్ష్మీనారాయణను సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. అక్కడ వైద్యులు లక్ష్మీనారాయణను పరీక్షించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు" అని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు.. తన కొడుకు తమకు చెప్పలేదని ఆయన అన్నారు. లక్ష్మీనారాయణకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతని మరణానికి వైద్యులదే బాధ్యత" అని చెప్పారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో క్లినిక్‌ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రి రికార్డులు, సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios