Telangana: పెళ్లి వేడుకలో తల్వార్లు, తుపాకులతో డ్యాన్స్.. నవవరుడు సహా ఇతరులు అరెస్ట్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మైత్రి ఫంక్షన్‌లో జులై 10వ తేదీన ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో పెళ్లి కొడుకు, ఆయన స్నేహితులు తుపాకులు, తల్వార్‌లతో డ్యాన్స్ చేయడం కలకలం రేగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో కలకలం రేగింది. ఫంక్షన్‌లో జరిగిన పెళ్లి వేడుకలో కొందరు కత్తులు, తుపాకులు తీయడం పెళ్లికి హాజరైన అతిథులు సహా స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. మ్యూజిక్‌కు కొత్త పెళ్లి కొడుకు సహా అతని స్నేహితులు తల్వార్‌లు, తుపాకులతో డ్యాన్స్ స్టెప్‌లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. పోలీసుల కంట పడింది. పోలీసులు రంగంలోకి యాక్షన్ తీసుకుంటున్నారు. కొత్త పెళ్లి కొడుకు, ఆయన స్నేహితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: తిరుపతి దేవస్థానంలో ఇస్రో శాస్త్రవేత్తల పూజలు.. రేపు చంద్రయాన్ 3 ప్రయోగం
ఈ ఘటన మద్నూర్ మండల కేంద్రంలోని మైత్రి ఫంక్షన్ హాల్‌లో జులై 10వ తేదీ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దూకారు. స్పాట్‌కు వెళ్లి పెళ్లి కొడుకు అబ్బు మియాతోపాటు అతని స్నేహితులు షోయబ్, అర్బజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.