వైఎస్ఆర్ మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశానికి తీరని లోటు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం దేశానికి తీరని లోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళల మృతి: ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిపుణుల కమిటీ విచారణ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు అత్యతం ప్రజాస్వామికంగా ఉండేవని అన్నారు. వైఎస్ ఆలోచనలు, నడవడిక, భాషా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి ఆదర్శంగా ఉంటాయని తెలిపారు. పార్టీలకు నాయకత్వం వహించాలని అనుకునేవారికి మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే కేవలం దూషణలు, అసభ్యపదజాలంతో మాట్లాడటం కాదని అన్నారు.
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు: ఖమ్మం కోర్టులో లొంగిపోయిన సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు
సైద్దాంతికంగా నిబద్ధతతో నమ్మిన విషయాలను స్పష్టంగా ప్రజలకు వివరించడమే కాకుండా వారిని మెప్పించి, ఒప్పించి ప్రజల హృదయాలను గెలుచుకొని వైఎస్ఆర్ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక స్పృహాతో, అభివృద్ధి కాంక్షతో ఎదిగిన మహానాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన అర్థాంతరంగా మరణించడం ఈ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత?: కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి నిర్మలా ఫైర్
అత్యంత రాజకీయ పరిపక్వతతో కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతాలతో ఎదిగిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ కేవలం రాష్ట్రానికే కాదు. దేశానికి కూడా ఒక దశ, దిశ, నిర్దేశం చేశారని భట్టి తెలిపారు. ఆయన మృతి వల్ల తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం కూడా ఒక మంచి నాయకుడిని కోల్పొయాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కు వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, టెక్నాలజీ వంటి అంశాలపై ముందుచూపు కలిగి ఉండేవారని పేర్కొన్నారు.
