ఇక తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై కు అసెంబ్లీలో ప్ర‌సంగించే అవ‌కాశం లేన‌ట్టే..! ఎందుకంటే ?

తెలంగాణ గవర్నర్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ కాలం అయిపోయేంత వరకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఏడాది నుంచి అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య ఉన్న విభేదాల నేేపథ్యంలో ఈ ప్రభుత్వ కాలం అయిపోయేంత వరకు సభను ప్రోరోగ్ చేసే అవకాశం కనిపించడం లేదు. 

Governor Tamilasai will not have a chance to address the assembly ..! Because?

తెలంగాణ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్యరాజ‌న్  ప్ర‌సంగించే అవ‌కాశం ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. టీఆర్ఎస్ పెద్ద‌ల‌కు, రాజ్ భవన్ గ‌త కొన్ని నెలల నుంచి పొర‌పొచ్చాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా బ‌డ్జెట్ ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ ప్ర‌భుత్వ ట‌ర్మ్ అయిపోయేంత వ‌ర‌కు ఆమె ప్ర‌సంగం లేకుండానే అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగించాల‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

అసెంబ్లీని చివరిసారిగా ఏడాది కింద‌ట 2021 జూన్ 1వ తేదీన ప్రోరోగ్ చేశారు. గ‌త అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ను వారం రోజుల పాటు నిర్వహించి మార్చి 15న ముగించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని కోరలేదు. స్పీకర్ ప్రొరోగ్ కోరితే తప్ప గవర్నర్ ప్రోరోగేషన్ నోటిఫికేషన్ జారీ చేయలేరు. గవర్నర్, సీఎం కేసీఆర్ మ‌ధ్య స‌రైన స‌త్సంబంధాలు లేని నేప‌థ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌ను అసెంబ్లీలో ప్రసంగించనివ్వకుండా చేసే అవకాశం క‌నిపిస్తోంది.

నోటిఫికేషన్ ద్వారా అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తే.. గవర్నర్ సభలను పిలిపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. సంవత్సరంలో మొదటి సమావేశంలో లేక‌పోతే ముఖ్యంగా బడ్జెట్ సెషన్ లో అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించాలి. అయితే సభను ప్రోరోగ్ చేయకపోతే శాస‌న స‌భ స్పీక‌ర్, శాస‌న మండలి చైర్ పర్స‌న్ నోటిఫికేష‌న్లు జారీ చేసి తమ తమ సభలను సమావేశపరచవచ్చు.

రెండు నెలల కింద‌ట బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో ప్రసంగించేందుకు గవర్నర్‌ను ఆహ్వానించలేదు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయనందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఈ నేప‌థ్యంలో అప్పటి వరకు ప్రభుత్వం శాసన సభలను ప్రొరోగ్ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోర‌క‌పోవ‌చ్చు. 

అసెంబ్లీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత టర్న్ (2018) లో సభను 10 సార్లు సమావేశాలకు పిలిచారు. కానీ ఏడు సార్లు మాత్రమే ప్రోరోగ్ చేశారు. 2019 సెప్టెంబరు మొదటి వారంలో తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ప్రతీ ఆరు నెలలకు నాలుగు సార్లు ప్రొరోగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2019 న‌వంబ‌ర్ లో ఒక‌సారి, 2020 మేలో రెండో సారి, 2020 న‌వంబ‌ర్ లో మూడో సారి, 2021 జూన్ లో నాలుగో సారి ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల త‌రువాత నుంచి అసెంబ్లీని ప్రోరోగ్ కాలేదు. ఆ స‌మ‌యంలోనే పాడి కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ నామినేష‌న్ ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ పెండింగ్ లో ఉంచారు. అప్ప‌టి నుంచే గ‌వ‌ర్న‌ర్ కు, టీఆర్ఎస్ పెద్ద‌ల‌కు విభేదాలు ఉన్నాయ‌ని బ‌య‌ట‌ప‌డింది. 

ఏడాది కింద‌ట చివ‌రి సారిగా అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన త‌రువాత 2021లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అలగే ఈ ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే గ‌తంలో ESL నరసింహన్ గవర్నర్ ఉన్న సమయంలో 2019 జనవరిలో ఒక వారంలోపు, 2019 మార్చి జూలై మ‌ధ్య కాలంలో ఒక నెలలోపు అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏడాది గడుస్తున్నా ప్రోరోగ్ చేయ‌లేదు.  కాగా అసెంబ్లీని ఒక నిర్ధిష్ట స‌మ‌యంలోపు  ప్రొరోగ్ చేయాలనే రాజ్యాంగ నిబంధ‌న ఏదీ లేద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 2014లో రాష్ట్ర విభజన జ‌రిగిన స‌మ‌యంలో అసెంబ్లీని ఏడాదికి పైగా ప్రోరోగ్ చేయలేదని, కొన్ని రాష్ట్రాల్లో కూడా సభను ప్రోరోగ్ చేయలేదని సంద‌ర్భాలు ఉన్నాయని సీనియ‌ర్ అధికారులు చెబుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios