కోహెడ వద్ద అధునిక సౌకర్యాలతో కొత్త ఫ్రూట్ మార్కెట్

హైదరాబాద్‌ లోని గడ్డిఅన్నారం (కొత్త పేట) పండ్ల మార్కెట్‌ను వూరొదలిపెడుతూ ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దిల్ షుక్ నగర్ సమీపంలో ఉన్న ఈ ఫ్రూట్ మార్కెట్ ను కోహెడ సమీపంలోకి మార్చాలనుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో తెలిపారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగెల కృష్నా రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ మంత్రి ఫ్రూట్ మార్కెట్ తరలింపు విషయం వెల్లడించారు.,

 “గడ్డిఅన్నారం మార్కెట్‌ యార్డు ప్రస్తుతం 22 ఎకరాల్లో ఉంది. ఇందులో స్థలం చాలక వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మార్కెట్‌ను కోహెడకు తరలించాలనుకుంటున్నాం. అక్కడ 178 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతోకొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మార్కెట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌ పక్కనే వస్తుంది కాబట్టి రైతులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మార్కెట్‌ యార్డు తరలింపు వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య కూడా పరిష్కారమవుతుంది,” అని హరీశ్ రావు చెప్పారు.