హైదరాబాద్: ఆసుపత్రుల్లో సౌకర్యాల వివరాలను తెలుసుకొనేందుకు లైవ్ డ్యాష్ బోర్డుల ఏర్పాటుకు ఢిల్లీ ప్రభుత్వం నుండి టెక్నాలజీ సహకారం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారంపై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించింది.

ఆసుపత్రుల్లో బెడ్స్ తో పాటు ఇతర వివరాల కోసం లైవ్ డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే లైవ్ డ్యాష్ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్ వేర్ తయారు చేస్తోందని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఢిల్లీలో లైవ్ డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేశారని హైకోర్టు తెలిపింది.

also read:25 మందికి కరోనా: జూలై 9 నుండి తెలంగాణ హైకోర్టు మూసివేత

ఢిల్లీ ప్రభుత్వం నుండి సాఫ్ట్ వేర్ తో పాటు టెక్నాలజీని కోరాలని హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణణు ఈ నెల 14 వతేదీకి వాయిదా వేసింది హైకోర్టు.తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 1879  కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,621కి చేరుకొన్నాయి. కరోనాతో మంగళవారం నాడు ఒక్క రోజే ఏడుగురు మరణించారు.రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నాయి.