హైదరాబాద్: కరోనా దెబ్బకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 9వ తేదీ నుండి తాత్కాలికంగా మూత పడనుంది. హైకోర్టులో పనిచేసే 25 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో హైకోర్టును తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

హైకోర్టులో పనిచేసే ఉద్యోగులు కరోనా బారినపడడంతో హైకోర్టును శానిటేషన్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. కోర్టులోని అన్ని విభాగాలను శానిటేషన్ చేసేందుకు వీలుగా హైకోర్టును మూసివేయనున్నారు.

also read:కరోనా దెబ్బకు మెట్రో కుదేలు: రూ. 200 కోట్ల నష్టం, గడువు పెంచాలని లేఖ

కరోనా సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను విచారిస్తోంది. అయితే ఈ తరుణంలో హైకోర్టులో పనిచేసే ఉద్యోగులు కరోనా బారినపడడంతో ముందుజాగ్రత్తగా శానిటేషన్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

హైకోర్టు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 7వ తేదీన హైకోర్టులో పనిచేసే వారిలో 50 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 10 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో హైకోర్టును శానిటేషన్ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయం తీసుకొన్నారు. 

హైకోర్టులోని ఫైల్స్ అన్నింటిని జ్యూడీషీయల్ అకాడమీకి తరలించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైన కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.