Asianet News TeluguAsianet News Telugu

గజదొంగకి.. గవర్నమెంట్ జాబ్

పోలీసులకు ముచ్చెమటలు పట్టించి.. 18 చోరీ కేసుల్లో మూడేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపిన గజదొంగకి పోలీసులు ఉపాధి కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చోరీ కేసుల్లో చెంచులక్ష్మీ అనే మహిళా దొంగ ప్రధాన నిందితురాలు

government job for women thieve
Author
Hyderabad, First Published Nov 10, 2018, 10:48 AM IST

పోలీసులకు ముచ్చెమటలు పట్టించి.. 18 చోరీ కేసుల్లో మూడేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపిన గజదొంగకి పోలీసులు ఉపాధి కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చోరీ కేసుల్లో చెంచులక్ష్మీ అనే మహిళా దొంగ ప్రధాన నిందితురాలు.

పలు కేసుల్లో ఆమె నేరం రుజువుకావడంతో న్యాయస్థానం లక్ష్మీకి శిక్ష విధించింది. ఈ క్రమంలో మూడేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో ఆమె శుక్రవారం కారాగారం నుంచి విడుదలైంది. తనను పోలీసులే దొంగగా మార్చారని పలు సందర్భాల్లో పోలీస్ శాఖపై చెంచులక్ష్మీ విమర్శలు చేసింది..

ఈ విషయం అధికారులకు వివరించగా.. ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి చంచల్‌గూడ జైలులోని మహిళా పెట్రోల్ బంకులో ఉపాధి కల్పించడంతో పాటు ఇల్లు, కొంత డబ్బు కూడా చెల్లించినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios