Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ మార్క్ ప్రజాపాలన షురూ... బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు భారీ నిధులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రూ.1190 కోట్ల నిధులను మంజూరు చేసారు. 

 

 

Telangana Goverment Sanctioned RS. 1190 crores to All constituencies AKP
Author
First Published Feb 2, 2024, 8:06 AM IST | Last Updated Feb 2, 2024, 8:55 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.1,190 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా 119 నియోకవర్గాల్లో తాగునీరు, పారిశుద్ద్యంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ది, సంక్షేమం కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ నిధుల్లో రూ.2 కోట్లను ఆయా నియోజకవర్గాలోని ప్రభుత్వ స్కూళ్లలో పనులకు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది.

నియోజకవర్గానికి మంజూరుచేసిన నిధుల్లోంచి రూ.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మంజూరు చేసిన నిధులను నియోజకవర్గంలో ఏయే అవసరాలకు ఉపయోగించాలో... వాటితో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో ప్రభుత్వమే సూచించింది. ఇక ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ది పనుల కోసం మిగతా నిధులను ఉపయోగించుకునే  అవకాశం  కల్పించింది. 

Also Read  సీఎంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ చేరిక కోసమేనా? : షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే నియోజర్గాలకు కేటాయించిన నిధులను మంజూరుచేసే అధికారాన్ని జిల్లా ఇంచార్జీ మంత్రులకు అప్పగించింది ప్రభుత్వం. ఇలా హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యధికంగా రూ.150 కోట్ల విడుదల బాధ్యత తీసుకోనున్నారు. ఇలా కరీంనగర్‌-ఉత్తమ్ కుమార్ రెడ్డి - రూ.130 కోట్లు, మహబూబ్ నగర్ - రాజనర్సింహ- రూ.140 కోట్లు, ఖమ్మం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-రూ.100 కోట్లు, రంగారెడ్డి- శ్రీధర్ బాబు-రూ.140 కోట్లు, వరంగల్-శ్రీనివాస్ రెడ్డి- రూ.120 కోట్లు, మెదక్-కొండా సురేఖ-రూ.100 కోట్లు,  ఆదిలాబాద్-సీతక్క-రూ.100 కోట్లు, నల్గొండ-  తుమ్మల నాగేశ్వర రావు-రూ.120 కోట్లు, నిజామాబాద్-జూపల్లి కృష్ణారావు-రూ.90 కోట్లు నిధులు మంజూరు చేసే బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios