ఐటీ రిటర్న్స్ గురిచి నాకే తెలీదు.. ఇక వాళ్లకేం తెలుస్తది.. గవర్నర్

governer narasimhan questioned IT officials over IT returns
Highlights

నిజాయతీగా పన్ను చెల్లించేవారిని గౌరవించాలని హితవు పలికారు. ‘ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’ అని అంటూనే.. లోటుపాట్లను ఎత్తిచూపారు. ఈ అనూహ్య పరిణామంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.

ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో నాకే సరిగా లేదు.. ఇక సీనియర్ సిటిజన్స్, చదువుకోని వారికి ఎలా తెలుస్తుందని అని ప్రశ్నించారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. మంగళవారం ఐటీ శాఖ 158వ వార్షికోత్సవానికి నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. నిజాయతీగా పన్ను చెల్లించేవారిని గౌరవించాలని హితవు పలికారు. ‘ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’ అని అంటూనే.. లోటుపాట్లను ఎత్తిచూపారు. ఈ అనూహ్య పరిణామంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.  

ఆయన మాటల్లో ముఖ్యాంశాలు ఇవే..
‘‘కంప్యూటర్‌ తరానికి అనుకూలంగా ఈ-రిటర్న్స్‌ ప్రారంభించారు సంతోషం. మరి సీనియర్‌ సిటిజన్లు, కంప్యూటర్‌ పరిజ్ఞానం లేనివారి సంగతేంటి? ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడంలో గందరగోళం ఎందుకు..? 3, 3ఏ, 16 ఇలా ఏవేవో ఫారాలు ఉంటాయి. ఒక సీనియర్‌ సిటిజన్‌గా ఇది నాకే అర్థం కాదు. మరి చదువురాని వారి పరిస్థితేంటి?’’


‘‘భవిష్యత్తు అవసరాల కోసం కూడబెట్టుకున్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి భయపడుతున్నారు. రూ.5లక్షలు డిపాజిట్‌ కోసం బ్యాంకుకెళ్తే ఇంత డబ్బు మీకెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించేవారిని అనుమానంగా చూడడం ఎంతవరకు సబబని నా దగ్గరకొచ్చే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.’’


’’ఐటీ దాడులంటూ మీడియాలో చూస్తుం టాం. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని పత్రికల్లో చదువుతుంటాం. కానీ, తర్వాత ఏం జరిగిందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.’’

loader