బీజేపీకి షాక్: విక్రం గౌడ్ రాజీనామా, కాంగ్రెస్‌లో చేరే అవకాశం


మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్  బీజేపీకి రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీలో  విక్రం గౌడ్ చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.

 Goshamahal BJP Leader Vikram Goud Resigns To BJP lns

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్  తనయుడు, భారతీయ జనతా పార్టీ నేత  విక్రం గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను విక్రం గౌడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.భారతీయ జనతా పార్టీ. పార్టీ కోసం  పనిచేసినా తనకు  గుర్తింపు ఇవ్వలేదని  కిషన్ రెడ్డికి పంపిన లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి  బీజేపీ తరపున  పోటీ చేయాలని భావించాడు. కానీ, ఈ స్థానం నుండి  రాజాసింగ్ కు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది.

also read:గుడ్‌‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు

విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు.  హైద్రాబాద్ నగరంలో  కాంగ్రెస్ పార్టీలో  కీలక నేతల్లో  ముఖేష్ గౌడ్ ఒకడుగా ఉండేవారు. గత కొంతకాలంగా పార్టీ తీరుపై విక్రమ్ గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు.గోషామహల్ టికెట్ ను  విక్రమ్ గౌడ్ ఆశించారు. అయితే  ఈ స్థానాన్ని రాజాసింగ్ కే  బీజేపీ నాయకత్వం కేటాయించింది. సస్పెన్షన్ ఎత్తివేసిన కొన్ని గంటల్లోనే   బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే రాజా
సింగ్ కు గోషామహల్ టిక్కెట్టు కేటాయించింది బీజేపీ.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే వ్యూహంతో  బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.  గ్రేటర్ హైద్రాబాద్ కు చెందిన  విక్రం గౌడ్ రాజీనామా చేయడం  ఆ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. 

also read:జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

హైద్రాబాద్ నగరంపై  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. గత ఏడాది నవంబర్ లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో  ఎమ్మెల్యే సీట్లు దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిపై  కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే  బీజేపీలో అసంతృప్తితో ఉన్న విక్రం గౌడ్ కు  కాంగ్రెస్ నాయకత్వం  గాలం వేసిందనే  ప్రచారం సాగుతుంది. త్వరలోనే విక్రం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని  చెబుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios