త్వ‌ర‌లోనే శ‌బ‌రిమ‌ల‌లో తెలంగాణ భ‌వ‌న్ కు భూ కేటాయింపు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన కేర‌ళ దేవాస్వామ్ కార్య‌ద‌ర్శి
తెలంగాణ అయ్యప్ప భక్తులకు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది. కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపడతామని సర్కారు గతంలోనే ప్రకటించింది. అయితే ఆ దిశగా ఇంకో ముందడుగు పడింది.
శబరిమలలో తెలంగాణ భవన్ కోసం త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని దేవాస్వామ్ కార్యదర్శి (Secretary- Revenue (Devaswom) జ్యోతి లాల్ తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఇవాళ సచివాలయంలో జ్యోతి లాల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి కావాల్సిన స్థల కేటాయింపుపై చర్చించారు. దీనిపై కేరళ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని జ్యోతి లాల్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తెలిపారు. శబరిమలలో ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
చిరంజీవి ఇంట్లో దొంగతనం.. ఈ వార్తతోపాటు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
