Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌యాణికుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ.500కే నెల‌వారి 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌'

TSRTC: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమ‌వారం ఈ బస్‌ పాస్‌ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు.
 

Good news for TSRTC passengers Monthly 'Palle Velugu Town Bus Pass' for Rs 500 RMA
Author
First Published Jul 17, 2023, 4:26 PM IST

Pallevelugu Town Bus Pass: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమ‌వారం ఈ బస్‌ పాస్‌ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. సంస్థ‌ను మెరుగు ప‌రిచే చ‌ర్య‌ల‌తో పాటు ప్ర‌యాణికుల భారం త‌గ్గించే చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి తాజాగా టీఎస్ ఆర్టీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. సంబంధిత ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 

రాష్ట్రంలో ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ తీసుకువచ్చింది. దీనిని మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది.

ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

“జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.

ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios