బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : భారీగా పోలీసు కొలువులు

First Published 31, May 2018, 6:01 PM IST
good news for telangana youth
Highlights

గెట్ రెడీ

తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు వెలువడ్డాయి. మొత్తం నాలుగు నోటిఫికేషన్లను పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది.

ఇందులో

కానిస్టేబుల్ ఉద్యోగాలు 18,196

ఎస్సై పోస్టులు 1217 పోస్టులు ఉన్నాయి.

అయితే వయో పరిమితి విషయంలో ప్రభుత్వం ఎటువంటి సడలింపు ఇవ్వలేదు.

అయితే నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలంగాణ సర్కారుకు ఎలాంటి విధాన నిర్ణయాలు వెలువరించరాదని, ఎన్నికల కోడ్ అములులోకి వచ్చిందని ప్రకటించారు. కానీ అవేమీ పట్టించుకోకుండానే పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు వయో పరిమితి సడలింపు కూడా ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుల తాలూకు పూర్తి వివరాలు కింద చూడండి.

కానిష్టేబుల్           16767
ఫైర్ మెన్                   168
వార్డెన్స్.                     221
ఎస్సైలు                    739
ఏ ఎస్సై.                      26
ఆర్ ఎస్సై.                  471
ఫైర్ ఆఫీసర్.                  90
డిప్యూటీ జైలర్.             15
ఆఐస్టెంట్ మ్యాటన్           2
–--------------------------------------
టోటల్.                        18428

loader