Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సర్పంచ్ లకు శుభవార్త

  • కనీస విద్యార్హత నిబంధనపై వెనకడుగు
  • ఆ నిబంధనతో ప్రయోజనం లేదని భావించిన సర్కారు
  • గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుంటున్న సర్పంచ్ లు, అభ్యర్థులు
good news for telangana sarpanches and aspirants

 

 

తెలంగాణ సర్పంచ్ లకు, సర్పంచ్ లు గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. ఇంతకాలం ఆ గండం మెడకు చుట్టుకుంటదేమోనని సర్పంచులు, సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు భయపడ్డారు. కానీ కీలకమైన ఈ సమయంలో తెలంగాణ సర్కారు ఆ దిశగా ముందుకెళ్లడం భావ్యం కాదని వెనకడుగు వేసింది. దీంతో సర్పంచులు రిలాక్స్ అయ్యారు. మరిన్ని వివరాలేమంటే...

గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసేవారికి కనీస విద్యార్హత నిబంధన విధించాలని తెలంగాణ సర్కారు ప్రయత్నించింది. దానికోసం మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు సమావేశమై సర్పంచ్ పదవికి పోటీ చేసే వారికి కనీస విద్యార్హత నిబంధన విధించాలని చర్చించారు. ఆ దిశగా కసరత్తు చేశారు. కానీ ఆ నిబంధన తీసుకురావడం వల్ల కొత్త సమస్యలు వచ్చి పడతాయని పైగా తమ సర్కారుకు అప్రతిష్ట వస్తదన్న భయంతోనే సర్కారు ఆ నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఆలోచన నుంచి విరమించుకున్నట్లు సర్పంచ్ సంఘాల నేతలు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. దీంతో గిరిజన తాండాల్లో నిరక్షరాస్యత ఇంకా ఉన్నది. మరి అలాంటప్పుడు అక్కడ కనీస విద్యార్హత నిబంధన పెడితే అభ్యర్థుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుందని సర్కారు వెనకడుగు వేసింది. అంతేకాదు.. కొన్ని గ్రామాల్లో చదువు రాకపోయినా ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు ఉంటారు. వారందరూ పోటీ చేయడానికి అర్హత కోల్పోతే వారి నుంచి, అలాగే జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదముంటుందని సర్కు అంచనా వేసింది.

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీకి జనాభా ఆధారంగా ఏటా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఇకపై జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలంటూ లేకుండా కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకే విడుదలవుతాయి. వీటన్నింటినీ పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బందిని అజమాయిషీ చేసే సర్పంచి విద్యావంతుడైన పక్షంలో..ఆయా మార్గదర్శకాలను చదివి వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు వీలువుతుందనే వాదన చేశారు. పంచాయతీరాజ్‌ నూతన చట్టం తయారీ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ దిశగా గతంలో  చర్చించింది. కనీస విద్యార్హత నిబంధన అమల్లో ఉన్న రాజస్థాన్‌, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులనూ ఉపసంఘం పరిశీలించనుందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కనీస విద్యార్హత నిబంధన ఇక్కడా అమలు చేస్తారన్న చర్చ రాష్ట్రంలో మొదలైంది.

కానీ ఈ నిబంధన తీసుకొస్తే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో పాత పద్ధతిలోనే సర్పంచ్ ఎన్నికలు జరపాలని సర్కారు భావిస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios