దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి ఆరు బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని Shamshabad Air Port లో బంగారాన్ని Customs అధికారులు సీజ్ చేశారు.
Dubai నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 Gold బిస్కెట్లను అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.37.30 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. . తమకు అందిన సమాచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తే ఈ బంగారం లభ్యమైందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
ఈ ఏడాది మార్చి 26న దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి 255 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు Women నుంచి 1.48 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమానం వచ్చి ముగ్గురు మహిళలను తనిఖీలు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు తమ లోదుస్తుల్లో బంగారం తీసుకొచ్చారు. మరో మహిళ నుంచి కూడా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 22న చోటు చేసుకొంది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు.
దుబాయ్ నుంచి వేర్వేరు ఫ్లైట్‌ల ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి అనుమానం రాకుండా లోదుస్తుల్లో దాచి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు.దీంతో పెద్ద ఎత్తున బంగారం బయటపడినట్లు అధికారులు తెలిపారు.
బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు పలు మార్గాల్లో బంగారాన్ని ఇతర దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి వచ్చే కొందరు లో దుస్తుల్లో, సాక్సుల్లో, బూట్లల్లో, ఉదరం లోపల, కాప్సుల్స్ రూపంలో బంగారాన్ని తీసుకువస్తూ చిక్కుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు 2021 డిసెంబర్ 14న పట్టుకున్నారు.
