Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్‌ నుండి 2 కిలోల గో‌ల్డ్ తో జంప్: పరారైన వ్యక్తి ఫ్యామిలీకి హైద్రాబాద్‌లో చిత్రహింసలు పెట్టిన గ్యాంగ్

దుబాయ్ నుండి హైద్రాబాద్ కు బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా ఓ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టింది. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Gold Smuggling Gang Harassment To Four members Family In Hyderabad
Author
Hyderabad, First Published Jun 24, 2022, 11:35 AM IST


హైదరాబాద్: Dubai  నుండి Hyderabad  కు బంగారాన్ని ఓ ముఠా తెప్పిస్తుందని పోలీసులకు ఫిర్యాదు అందింది.,దుబాయ్ నుండి Gold  తీసుకొస్తూ ఒకరు  తప్పించుకు పారిపోయాడు. దీంతో ఆ కుటుంబాన్ని బంగారం స్మగ్లింగ్ ముఠా తీవ్ర చిత్రహింసలు పెట్టింది.ఈ విషయమై బాధితులు Policeలకు ఫిర్యాదు చేయడంతో దుబాయ్ నుండి బంగారం స్మగ్లింగ్ వ్యవహరం వెలుగు చూసింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ NTV కథనం ప్రసారం చేసింది. 

పేదలను లక్ష్యంగా చేసుకొని దుబాయ్ నుండి బంగారాన్ని తీసుకు వచ్చి హైద్రాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని   పోలీసులకు బాధితులు చెప్పారని ఆ కథనం తెలిపింది. హైద్రాబాద్  Old City కి చెందిన షహబాజ్, పంజాగుట్టకు చెందిన అయాజ, Sanat nagar కు ఫహద్ లను బంగారం కోసం ఈ ముఠా దుబాయ్ కి పంపింది. దుబాయ్ నుండి ఈ ముఠా ఒక్కొక్కరికి రెండు కిలోల బంగారం తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది. 

దుబాయ్ నుండి ఇద్దరు రెండు కిలోల బంగారంతో హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. కానీ ఫయాద్ అనే వ్యక్తి మాత్రం రెండు కిలోల బంగారంతో పారిపోయినట్టుగా స్మగ్లింగ్ ముఠా గుర్తించింది. దీంతో ఫయాద్ కుటుంబ సభ్యలను బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిందని ఎన్టీవీ కథనం తెలిపింది. 

పాతబస్తీ శాస్త్రీపురంలోని ఓ విల్లాలో బాధితులకు చిత్రహింసలు పెట్టారు. ఈ విషయమై బాధితులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని  ఎన్టీవీ కథనంలో వివరించింది. ఈ విషయమై సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైద్రాబాద్ కు చెందిన 300 మంది ముఠా ఏర్పడి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారని  ఈ కథనం తెలిపింది.  హైద్రాబాద్ లోని ఓ రౌడీ షీటర్ మేనల్లుడే ఈ స్మగ్లింగ్  ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడని ఈ కథనం వివరించింది.  గతంలో రౌడీ షీటర్ బంగారం స్మగ్లింగ్ కు పాల్పడినట్టుగా పోలీసులు చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios