Asianet News TeluguAsianet News Telugu

ఒక్క మేసేజ్ తో తెలంగాణ వధువును కాపాడిన ఏపీ యువతి

మోసపోయిన సదరు యువతి శ్రీనివాస్‌ మోసాన్ని వధువుకు తెలపాలని నిశ్చయించుకుంది. ఏలాగోఅలాగా వధువు ఫోన్ నెంబర్ సంపాదించి శ్రీనివాస్‌తనను మోసం చేసినట్లు మేసేజ్ పెట్టింది. సాక్ష్యాలతో సహా రుజువులు పంపింది.

girlfriend stops cheated boyfriend marriage with a sms

సాంకేతిక ఓ నిండు జీవితాన్ని కాపాడింది. ఒకరి బండారాన్ని బయటపెట్టింది. మోసగాడైన పెళ్లికొడుకు నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేసింది.
 

వరంగల్ కు చెందిన ఓ యువతికి ఏపీ లోని కృష్ణ జిల్లా విజయవాడకు చెందిన భరత్‌ శ్రీనివాస్‌తో వివాహం నిశ్చయమైంది.

 

సదరు యువకుడు పెళ్లికి ముందే అమ్మాయి తరుఫువారి నుంచి రూ.15 లక్షల కట్నం కూడా తీసుకున్నాడు. అంతేకాదు అతడికి విజయవాడకే చెందిన మరో యువతతో ఐదేళ్లుగా సంబంధం ఉంది.

 

ఆమెను మోసం చేసిన శ్రీనివాస్‌ ఇంట్లో చెప్పిన సంబంధాన్ని  ఓకే చేశాడు. అన్ని బాగుంటే వరంగల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అతడి పెళ్లి కూడా అయిపోయేదే.

 

అయితే మోసపోయిన సదరు యువతి శ్రీనివాస్‌ మోసాన్ని వధువుకు తెలపాలని నిశ్చయించుకుంది. ఏలాగోఅలాగా వధువు ఫోన్ నెంబర్ సంపాదించి శ్రీనివాస్‌తనను మోసం చేసినట్లు మేసేజ్ పెట్టింది. సాక్ష్యాలతో సహా రుజువులు పంపింది.

 

దీంతో వధువు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది.  వారంతా పెళ్లికొడుక్కి దేహశుద్ధి చేసి సుబేదారి పోలీసులకు అప్పగించారు.

 

అయితే పెళ్లికి  ముందే శ్రీనివాస్‌ నిజస్వరూపం బయటపడటంతో వధువు తరఫువారు ఆనందం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios