Asianet News TeluguAsianet News Telugu

ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్ప‌త్రిలో బాలిక‌పై అత్యాచారం.. కేసు న‌మోదు

Hyderabad: హైద‌రాబాద్ లోని ఎర్ర‌గ‌డ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగ‌రంలో నివాసం ఉంటున్న ఓ పేషెంట్ ఈఎస్ఐ హాస్పిటల్ పీఎంఆర్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, అత‌ని అటెండర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బాలిక‌పై ఆస్పత్రిలోని క్యాంటీన్ లో ప‌నిచేస్తున్న అజయ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.
 

Girl raped at ESI Hospital in Erragadda, Hyderabad; case registered RMA
Author
First Published Sep 17, 2023, 11:01 AM IST

Erragadda ESI Hospital: హైద‌రాబాద్ లోని ఎర్ర‌గ‌డ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగ‌రంలో నివాసం ఉంటున్న ఓ పేషెంట్ ఈఎస్ఐ హాస్పిటల్ పీఎంఆర్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, అత‌ని అటెండర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బాలిక‌పై ఆస్పత్రిలోని క్యాంటీన్ లో ప‌నిచేస్తున్న అజయ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితులు, పోలీసులు వెల్ల‌డించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఒక బాలిక‌పై అక్క‌డి క్యాంటీన్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈఎస్ఐ క్యాంటీన్ లో చ‌పాతీ మేకర్ గా పనిచేస్తున్న నిందితుడు బాధితురాలిని బలవంతంగా కారిడార్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. "ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ రెండు రోజుల క్రితం తన సోదరుడితో కలిసి వైద్యం కోసం వచ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె అత్యాచారానికి గురైంది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు నమోదు చేశాం. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు" ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ వీఆర్ ప్రసాదరావు తెలిపారు. క్యాంటీన్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విచారించామనీ, నిందితుడిని గుర్తించామని విశ్వసనీయ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios