బాబాయ్ అత్యాచారం: గర్భం దాల్చిన అమ్మాయి

Girl impregnated, raped by her relative
Highlights

వావివరుసలు మరిచి ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఖమ్మం: వావివరుసలు మరిచి ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. వరుసకు కూతురు అయిన బాలికను బెదిరించి లొంగదీసుకుని కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు 

ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని జోగ్గూడెంలో జరిగింది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం - గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక వేసవి సెలవులు కావడంతో అదే గ్రామంలోని తమ ఆకు కూరలతోట వద్దకు రోజూ కాపలాకు వెళ్తోంది. ఈ క్రమంలో వరసకు బాబాయి అయిన 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
తల్లిదండ్రులకు చెప్తే మీ నాన్నను చంపుతానని బెదిరించి ప్రతి రోజూ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. మూడురోజుల క్రితం బాలిక కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బాలిక గర్భవతి అని నిర్ధారణ అయింది. 
దాంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. బాధిత కుటుంబం ఈనెల 5న కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.

loader