వరంగల్ లో మరో ప్రేమ విఫలమైన సంఘటన జరిగింది. అయితే ఇక్కడ ప్రేమలో విఫలమైన అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలివి.

వరంగల్ నగరానికి చెందిన ఈ అమ్మాయి పేరు మౌనిక. ఈమె వరంగల్ లో కీర్తినగర్ లో నివాసముంటున్న సమీర్ అనే ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. అయితే ఆ సమీర్ ఈమె ప్రేమను కాదన్నాడు.

తాను మోసపోయానని గుర్తించిన మౌనిక తట్టుకోలేక చేతిపై బ్లేడ్ తో కోసుకుంది. నగరంలోని పోస్ట్ ఆఫీస్ కూడలిలో నానా హడావిడి చేసింది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న సమయంలో స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమెను నిలువరించారు.

చేతికి కట్టు కట్టి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుం ఆమె కోలుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.