హైదరాబాద్:  వివాహేతర సంబంధం నేపథ్యంలో స్వీట్ షాపులో పనిచేసే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవలో ఒకరి ప్రాణాలు పోయాయి. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ లోని మధురానగర్ స్వీట్ షాపులో శ్రీనివాస్, గౌస్ అనే ఇద్దరు పనిచేస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకొంది.

also read:ప్రియురాలి కోసం భార్యను చంపాడు:ట్విస్టిచ్చిన లవర్ హత్య

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకొన్నారు. శ్రీనివాస్ ముఖంపై గౌస్ పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. 

శ్రీనివాస్ స్వస్థలం కొత్తగూడెం జిల్లా రామవరం. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళ కోసం వీరిద్దరూ గొడవకు దిగారు.  ఆమొ ముందే ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్ మరణానికి కారణమైన గౌస్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరి మధ్య ఘర్షణ ఇదే కారణమా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.