హైద్రాబాద్‌లో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు: 500 వీధి కుక్కలను పట్టుకున్న జీహెచ్ఎంసీ

హైద్రాబాద్ నగరంలో  కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుంది.   గతంలో కంటే  కుక్కకాటు  చికిత్స కోసం  వచ్చే వారి సంఖ్య పెరిగిందని  వైద్య సిబ్బంది  చెప్పారు.  
 

GHMC steps up to tackle street dog menace

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో  కుక్క కాటు బాధితుల సంఖ్య  రోజు రోజుకి పెరుగుతుంది.  కుక్కకాటు  చికిత్స కోసం  హైద్రాబాద్ నారాయణగూడ ప్రివెంటివ్ సెంటర్ కు  బాధితులు  వందల సంఖ్యలో చేరుకుంటున్నారు.  సాధారణంగా  ప్రతిరోజూ  నారాయణగూడ  ప్రివెంటివ్  సెంటర్ కు  500 మంది  చికిత్స కోసం  వస్తుంటారు.  అయితే ఇటీవల కాలంలో  ఈ సంఖ్య   పెరగుతుూ వస్తుందని  వైద్య సిబ్బంది చెబుతున్నారు.  జీహెచ్ఎంసీ పరిధితో  పాటు  హైద్రాబాాద్ సమీపంలోని  ఇతర ప్రాంతాల  ప్రజలు కూడా  ఈ సెంటర్ కు  వైద్య చికిత్స కోసం వస్తున్నారు.  

రెండు రోజుల క్రితం  హైద్రాబాద్  అంబర్ పేటలో   నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై  వీధికుక్కలు దాడి చేశాయి.ఈ దాడిలో  ప్రదీప్ మృతి చెందాడు.  కుక్కల దాడిలో  తీవ్రంగా గాయపడిన  ప్రదీప్  మృతి చెందాడు.  ఈ ఘటనతో  అధికారుల్లో  చలనం వచ్చింది.  

జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి  నిన్న అత్యవసరంగా  అధికారులతో  సమీక్ష సమావేశం  ఏర్పాటు  చేశారు. వీధి కుక్కలను పట్టుకోవాలని ఆదేశించారు. కుక్కల సెర్టిలేజేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. మేయర్  ఆదేశాలతో  జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో  ఇప్పటివరకు  500 వీధి కుక్కలను జీహెచ్ఎంసీ  సిబ్బంది పట్టుకున్నారు.నగరంలో  వీధి కుక్కలు, కోతలు బెడదను అరికట్టేందుకు గాను  ఈ నెల  23న ప్రత్యేకంగా  సమావేశమై  అధికారులతో  చర్చించనున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు. 

also read:తెలంగాణలో భయపెడుతున్న వీధి కుక్కలు: కరీంనగర్, హైద్రాబాద్‌లలో ముగ్గురిపై దాడి

అంబర్ పేట  ఘటన తర్వాత   రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వీధికుక్కల  దాడుల ఘటనలు చోటు  చేసుకున్నాయి.  హైద్రాబాద్  చైతన్యపురి  మారుతీనగర్ లో  నాలుగేళ్ల బాలుడిపై  వీధి కుక్కలు దాడి  చేశాయి.  రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడు  కుక్కలను తరిమివేశాడు. దీంతో  ప్రమాదం  తప్పింది.  ఉమ్మడి  కరీంనగర్  జిల్లాలోని శంకరపట్నంలోని ఎస్సీ హస్టల్ లో  సుమన్ అనే విద్యార్ధిపై  కుక్క దాడి  చేసింది.  వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామంలో  యేసయ్య అనే వ్యక్తిపై  కుక్క దాడిలో  వాహనదారుడు యేసయ్య గాయపడ్డాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios